కళ్యాణ్ రామ్ హీరోయిన్ దశ తిరిగిపోయింది.!
- August 05, 2024
‘అమిగోస్’ సినిమా గుర్తుంది కదా.! కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నటించిన అందాల భామ గుర్తుందా.! ఆషికా రంగనాధ్. నిజంగానే అందాల భామే. అయితే డెబ్యూ కలిసి రాలేదు.
కానీ, తర్వాత అక్కినేని నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో చెలరేగిపోయిందీ అమ్మడు. తొలి సినిమాలో అందాల ఆరబోతతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన ఈ బ్యూటీ సెకండ్ మూవీలో పర్ఫామెన్స్తో భళా అనిపించింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది ఆషికా రంగనాధ్. తమిళ నటుడు కార్తీ హీరోగా ‘సర్ధార్ 2’ సినిమాలో ఆషికా రంగనాధ్ నటిస్తోంది.
ఈ సినిమాలో ఆల్రెడీ మాళవికా మోహనన్ ఒక హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆషికా రంగనాధ్ పేరును కూడా ప్రకటించింది అధికారికంగా చిత్ర యూనిట్.
గతంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘సర్ధార్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. కార్తీ సినిమా అంటే ఖచ్చితంగా విషయమున్న సినిమానే అవుతుంది. అందులోనూ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో భారీగా అంచనాలున్నాయ్.
సో, అమ్మడు ఆషికా రంగనాధ్ కెరీర్‌కి ఇది ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







