తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
- August 05, 2024
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలని తాను కోరడంతో ఆనంద్ మహీంద్రా అంగీకరించారని.. కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్‌లో సీఎంతో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పై చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







