షూటింగ్ పూర్తి చేసుకున్న 'షేర్'
- July 04, 2015
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'షేర్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. జూలై 5 కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా 'షేర్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ ` ''మా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'షేర్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేశాం. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. 'పటాస్'తో సూపర్‌హిట్ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి 'షేర్' కూడా మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారు ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో 'షేర్' ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. 'పటాస్' తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు'' అన్నారు. డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, ఆలీముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ`మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్ ఎస్.ఎస్., ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: మల్లికార్జున్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







