త్రినాథరావు కథతో 'ఆయుష్మాన్ భవ'
- June 16, 2016
మూలనపడిన ఆశీర్వచనంగా మిగిలిన 'ఆయుష్మాన్ భవ' సూర్య పుణ్యమా అని '24' సినిమాతో కాస్త ఆయువు పోసుకుని మళ్ళీ 'తెర'పైకి వచ్చింది. విలన్ అయినప్పటికీ ఆత్రేయ పాత్రతో 'ఆయుష్మాన్ భవ' అని దర్శకుడు విక్రమ్ చెప్పించడం ఈ సినిమాలో ప్రత్యేకత. ప్రస్తుతం ఈ 'ఆయుష్మాన్ భవ'కు ఇంకాస్త ఆయుష్షు పెంచుతున్నాడు మరో దర్శకుడు త్రినాథరావు నక్కిన. 'సినిమా చూపిస్తా మావా' సినిమాతో గతేడాది సూపర్ డూపర్ హిట్ కొట్టిన త్రినాథరావు కథతో ఓ సినిమా రానుంది. మారుతి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి 'ఆయుష్మాన్ భవ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మారుతి టాకీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం-12గా తెరకెక్కనున్న ఈ సినిమా రచయిత పరచూరి వెంకటేశ్వరరావు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ప్రారంభమయింది.
మారుతి టాకీస్‌తో పాటు శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో 'భద్రం బీకేర్ ఫుల్' ఫేమ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించి, సెట్స్‌మీదికి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇదిలా ఉంటే నాని-త్రినాథరావు కాంబినేషన్‌లో రానున్న సినిమా ఆగష్ట్ నుండి సెట్స్ మీదికెళ్ళనుందని సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







