గృహాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి స్మార్ట్ పరిష్కారాలు: ఖతార్

- August 08, 2024 , by Maagulf
గృహాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి స్మార్ట్ పరిష్కారాలు: ఖతార్

దోహా: ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ ఉపకరణాల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడటానికి స్మార్ట్ హోమ్ పరికరాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. "ఇప్పుడు మేము ఎయిర్ కండీషనర్‌లను నియంత్రించడానికి స్మార్ట్ హోమ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల వైపు వెళ్తున్నాము" అని కహ్రామాలోని టెక్నాలజీ విభాగం హెడ్ ఇంజి నాజర్ అల్ ఖుజాయీ తెలిపారు. వేసవిలో ఇంటి మొత్తం విద్యుత్‌లో 70 శాతం ఎయిర్ కండిషనర్లు వినియోగిస్తాయని చెప్పారు. "స్మార్ట్ పరికరం ప్రజలను హెచ్చరిస్తుంది. వినియోగ రేటును ఇస్తుంది. రిమోట్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. వినియోగదారులు అనవసరంగా నడుస్తున్న ఎయిర్ కండీషనర్‌ను స్విచ్ ఆఫ్ చేయడానికి వీలు కల్పిస్తుంది." అని అల్ ఖుజాయ్ చెప్పారు. స్మార్ట్ హోమ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు నిర్దిష్ట చర్యలను ఆటో మాటిక్ గా నిర్వహిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com