గృహాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి స్మార్ట్ పరిష్కారాలు: ఖతార్
- August 08, 2024
దోహా: ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ ఉపకరణాల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడటానికి స్మార్ట్ హోమ్ పరికరాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. "ఇప్పుడు మేము ఎయిర్ కండీషనర్లను నియంత్రించడానికి స్మార్ట్ హోమ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ల వైపు వెళ్తున్నాము" అని కహ్రామాలోని టెక్నాలజీ విభాగం హెడ్ ఇంజి నాజర్ అల్ ఖుజాయీ తెలిపారు. వేసవిలో ఇంటి మొత్తం విద్యుత్‌లో 70 శాతం ఎయిర్ కండిషనర్లు వినియోగిస్తాయని చెప్పారు. "స్మార్ట్ పరికరం ప్రజలను హెచ్చరిస్తుంది. వినియోగ రేటును ఇస్తుంది. రిమోట్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. వినియోగదారులు అనవసరంగా నడుస్తున్న ఎయిర్ కండీషనర్‌ను స్విచ్ ఆఫ్ చేయడానికి వీలు కల్పిస్తుంది." అని అల్ ఖుజాయ్ చెప్పారు. స్మార్ట్ హోమ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు నిర్దిష్ట చర్యలను ఆటో మాటిక్ గా నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







