కువైట్ లో 6 ప్రైవేట్ క్లినిక్‌ల మూసివేత

- August 08, 2024 , by Maagulf
కువైట్ లో 6 ప్రైవేట్ క్లినిక్‌ల మూసివేత

కువైట్: ప్రైవేట్ ఆరోగ్య రంగంలో వైద్య ప్రకటనలను నియంత్రించే నియంత్రణలకు సంబంధించి చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 6 ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలను మూసివేసి, 7 మంది వైద్యులను విచారణకు రిఫర్ చేయాలని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవాడి ఆదేశాలు జారీ చేశారు. వైద్య వృత్తిలోని నీతి, నియమాలు, సూత్రాలకు విరుద్ధమైన పోటోలను ప్రచారం చేయడంతో తనిఖీ బృందాలు ఉల్లంఘనలను గుర్తించాయి. ఇదే కారణంతో తనిఖీ బృందం 7 మంది వైద్యులను కూడా విచారణకు రిఫర్ చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com