తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
- August 09, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం విడుదల చేయనుంది. ఆగస్ట్ పదో తేదీకి సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 09 మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు అంగప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హుండీ వరకూ చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అంగ ప్రదక్షిణ పూర్తి అయినట్లు చెప్తారు. మరోవైపు సుప్రభాత సేవ మొదలైన తరవాత.. అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
మరోవైపు బుధవారం 75 వేల 109 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30 వేల 285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీకి రూ.3 కోట్ల 40 లక్షలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టినట్లు తెలిపింది. అయితే వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!