ఒమన్ లేబర్ మార్కెట్..అభివృద్ధి పై కీలక ముందడుగు..!
- August 12, 2024
సలాలా: లేబర్ ఫోరమ్.. "టుగెదర్ వీ వర్క్..టుగెదర్ వీ ఇన్నోవేల్ అండ్ ప్రాస్పర్" అనే శీర్షికతో లేబర్ మార్కెట్‌ను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గాలను పరిశీలించడంతో పాటు దానికి సంబంధించిన సమస్యలను చర్చిస్తుంది. 400 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ నిపుణులు, పెట్టుబడిదారులు ఫోరమ్‌లో పాల్గొంటున్నారు. ఇది ఆగస్టు 29 వరకు కొనసాగుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా మిలీనియం సలాలా హోటల్లో ప్రారంభించబడిన ఫోరమ్.. కార్మిక మంత్రి డాక్టర్. మహద్ సెయిద్ బావోయిన్ ఆధ్వర్యంలో అరబ్ ప్రపంచంలోని వృత్తిపరమైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ వ్యవస్థ గురించి కూడా చర్చిస్తుంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (SDGలు), కొత్త పని నమూనాలు, పోటీ సామర్థ్యాలను పెంపొందించడంలో కార్మికుల పాత్ర, వృత్తిపరమైన కౌన్సెలింగ్ వంటి సంస్కరణలపై కూడా చర్చలుంటాయని లేబర్ మినిస్ట్రీ వెల్లడించారు. ఫోరమ్‌లో 40 మంది వక్తల భాగస్వామ్యంతో 12 డైలాగ్ సెషన్లు ఉన్నాయని, మానవ వనరుల అభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, సామాజిక బాధ్యతతో పాటు మంచి పని వాతావరణం, ఒమన్ విజన్ 2040 దిశలను సమీక్షించడంతో సహా ప్రధాన అంశాల స్పెక్ట్రమ్‌ను సమీక్షించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







