రన్ ఓవర్ ప్రమాదం.. వాహనదారుడు, పాదచారులకు జరిమానా
- August 12, 2024
దుబాయ్: డ్రైవర్లు మరియు పాదచారులు ఇద్దరికీ నిబంధనలు, జరిమానాలు వర్తిస్తాయని.. ట్రాఫిక్ చట్టాల గురించి తెలుసుకోవాలని దుబాయ్ నివాసితులకు న్యాయ నిపుణుడు పిలుపునిచ్చారు. రన్ ఓవర్ ప్రమాదం తర్వాత దుబాయ్ కోర్టు ఒక వాహనదారుడికి మరియు పాదచారికి జరిమానా విధించింది. ఇతరుల భద్రతకు హాని కలిగించినందుకు వాహనదారుడికి 3,000 దిర్హామ్‌లు, నిర్దేశించని ప్రాంతం నుండి రోడ్డు దాటినందుకు పాదచారులకు 200 దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు న్యాయ నిపుణుడు అబ్దుల్రహ్మాన్ అల్ కస్సెమ్ వెల్లడించారు.
యూఏఈలో పాదచారులు రోడ్లు దాటడానికి జీబ్రా క్రాసింగ్‌లు, వంతెనలు లేదా సబ్‌వేలను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే 400 దిర్హామ్‌ల జరిమానా చెల్లించాలి. దుబాయ్ లో గత ఏడాది రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!