అతిలోక సుందరి ..!
- August 13, 2024
అతిలోక సుందరి అనే పదం వింటే నటి శ్రీదేవి తప్ప ఇంకెవరూ గుర్తుకు రారు. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ ఆమె.చిన్న వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను అలరించి జాతీయ స్ధాయిలో అగ్రశ్రేణి నాయికగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండగానే ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె లేరు అన్న నిజాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు.
శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయాంగర్ అయ్యప్పన్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. 4 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాలో నటించారు. దక్షిణ భారతీయ భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. తమిళం, తెలుగు, మళయాళ సినిమాల్లో నటించడానికి ఈ భాషలు ఆమెకు ఎంతగానో సహకరించాయి.
1976 లో కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘మూండ్రు ముడిచు’ సినిమాతో శ్రీదేవి జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందారు. తెలుగులోనూ అగ్రశ్రేణి నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ఆమె ఎక్కువ సినిమాల్లో నటించారు. సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో నటించిన శ్రీదేవి కృష్ణకి జోడిగా ఎక్కువ సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎంత సూపర్ హిట్ అన్నది అందరికీ తెలిసిందే. ఆ సినిమా తరువాత నుంచి అతిలోక సుందరి అంటే శ్రీదేవిగా ముద్రపడిపోయారు. వెంకటేష్‌తో క్షణ క్షణం, నాగార్జునతో గోవిందా గోవింద సినిమాల్లో నటించి అలరించారు.
అటు బాలీవుడ్‌లో యాక్షన్ కామెడీ సినిమా ‘హిమ్మత్ వాలా’లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సద్మా, చాల్ బాజ్ సూపర్ హిట్ అయ్యాయి. హిందీలో జితేంద్ర పక్కన ఎక్కువ సినిమాల్లో నటించారు శ్రీదేవి. నగీన, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్ బాజ్ సినిమాలు మంచి పేరు తెచ్చాయి.
2002 లో సినిమాల నుంచి విరామం తీసుకున్న శ్రీదేవి 2004 లో ‘మాలినీ అయ్యర్’ అనే సీరియల్ లో నటించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో జడ్జిగా వ్యవహరించారు. 2012 లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మళ్లీ అందర్నీ అలరించారు. 2017 లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఆమెను గౌరవించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను వివాహడారు శ్రీదేవి. ఆమెకు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు ఆడపిల్లలు. 2018, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు చనిపోయిన శ్రీదేవి తన అందం, నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!