మెగా బర్త్‌డే స్పెషల్.! ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్.!
- August 13, 2024
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేస్తున్నారట.
సినిమా థీమ్‌ని రివీల్ చేసేలా ఓ టీజర్ ప్లాన్ చేస్తున్నారనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజు మెగా అభిమానులు విభిన్న రీతుల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. అలాగే, ఆయన నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తుంటారు.
అలా ‘విశ్వంభర’ ఈ సారి మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తోన్న ఓ డిఫరెంట్ ఫ్యాంటసీ మూవీ. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మూడు కాలాల ప్రస్థావనతో ఈ సినిమా తెరకెక్కబోతోందని డైరెక్టర్ వశిష్ట ఆల్రెడీ చెప్పారు.
వశిష్టకు ఇది రెండో చిత్రం. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో. సో, చాలా ప్రెస్టీజియస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుండాలి ఈ సినిమా నుంచి రాబోయే టీజర్. అందుకే చాలా జాగ్రత్తగా ఫోకస్డ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. త్రిష, ఆషికా రంగనాధ్ తదితరులు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







