బతుకుదెరువు కోసం యూఏఈ వెళ్లి.......వేల కోట్లకు అధిపతిగా!
- August 13, 2024
యూఏఈ: ఈ రోజుల్లో ట్రెండింగ్ లో ఉన్న లులు మాల్ అంటే తెలియనివారు ఎవరు ఉండరని చెప్పవచ్చు. ఇది హైపర్ మార్కెట్ చెయిన్. మొదట గల్ఫ్ దేశాల్లో ఇలాంటి మాల్స్ ఉండేవి. ప్రస్తుతం ఇది భారత్ కు విస్తరించింది. మొదట దీనిని గల్ఫ్ దేశాలలో లాంచ్ చేసినప్పటికీ.... స్థాపించిన వ్యక్తి మాత్రం మన భారతీయుడే. ఏదో ఒక పని చేసుకుందామని కేరళ నుంచి దుబాయ్ వెళ్లిన భారతీయ యువకుడు అరబ్ షేక్స్ నీ షేక్ ఆడిస్తూ... వేల కోట్లకు అధిపతిగా మారాడు. లులు ఇంటర్నేషనల్ గ్రూప్ ను స్థాపించి.... 22 దేశాలకు పైగా..... 215 రిటైల్ స్టోర్స్, 50 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించి షాక్ ఇచ్చాడు.
అతనే లులు గ్రూప్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ.యూసుఫ్ అలీ. ఎలాంటి డబ్బులు లేకుండా ఖాళీ చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన కేరళ వాసి అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ దాని వెనుక ఎన్నో కన్నీళ్లు, కఠోరమైన శ్రమ, ధైర్యం, తెలివితేటలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇతని జీవిత ప్రస్థానం ఓ సినిమా కథని సైతం తలపిస్తుంది. కేరళలోని త్రిశూర తీర ప్రాంతంలోని నట్టిక అనే గ్రామంలో 1955 నవంబర్ 15న యూసుఫ్ అలీ జన్మించారు. ఆ తర్వాత యూసుఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. అతనికి 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత కోర్సు పూర్తయింది. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో యూసుఫ్ ను ఆర్థిక సమస్యల కారణంగా అరబ్ దేశం పంపాలని తన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇలా కేరళ నుంచి ఐదు రోజులు ఓడలో ప్రయాణించి పోర్ట్ రషీద్ కు చేరుకున్నారు యూసుఫ్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అబుదాబికి వెళ్లి బంధువులను కలుసుకున్నాడు.
మూడు సంవత్సరాలు కిరాణా షాప్ లో పనిచేశాడు. సరుకుల ఎగుమతి, దిగుమతులపై అవగాహన పెంచుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏ వస్తువు ఎంత తక్కువ ధరకు దొరుకుతుందో తెలుసుకొని షాపులో కూర్చునే కంటే అలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుందనుకున్నాడు. అప్పుడే యూసుఫ్ కు షబీర అనే యువతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అక్కడి నుంచి అతని దశ తిరిగింది. ఆ సమయంలోనే సూపర్ మార్కెట్ ట్రెండ్ ప్రారంభమైంది. దీంతో యూసుఫ్ హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో పర్యటించి వాటి గురించి తెలుసుకున్నారు. ఇక అబుదాబిలో అలాంటి సూపర్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచన చేశారు. ఒక సంవత్సరం పాటు కష్టపడి 1990లో ఎమిరేట్స్ జనరల్ మార్కెట్ పేరిట ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. అందులో మంచి లాభాలు వచ్చాయి. ఇక కేవలం సూపర్ మార్కెట్స్ తోనే ఆగకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, దిగుమతులు, ఆతిథ్యం ఇలాంటి రంగాలకు ఎగబాకాడు. యూసుఫ్ అదృష్టం బాగుండడంతో అతను పట్టిందల్లా బంగారం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే వేలకోట్లకు అధిపతిగా మారాడు.
--సాయికృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'