‘ధూమ్ ధామ్’ చేస్తానంటోన్న హెబ్బా పటేల్.!
- August 13, 2024
‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరపైకి వచ్చింది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. తొలి సినిమా నుంచే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్లు కొన్ని తన ఖాతాలో వేసుకుంది కూడా.
అయితే, ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటోంది. మొన్నా మధ్య ‘ఓదెల’ అనే సినిమాతో తనలోని నటికి ఛాలెంజ్ విసిరింది. సక్సెస్ అందుకుంది. ఓ వైపు హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంటూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ అదరగొడుతోందీ ముద్దుగుమ్మ.
లేటెస్ట్‌గా ‘ధూమ్ ధామ్’ అనే చిత్రంలో నటించింది. చేతన్ క్రిష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతకు ముందే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతోనూ ప్రేక్షకుల్ని పలకరించింది.
తాజా చిత్రం ‘ధూమ్ ధామ్’ ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. సినిమా ప్రచార చిత్రాలు కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తున్నాయ్. సకుటుంబ సమేతంగా వీక్షించదగ్గ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది ప్రచార చిత్రాలను బట్టి.
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పక్కా గ్లామరస్ అనే ఇమేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఫ్యామిలీ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకునేలా అనిపిస్తోంది చూడాలి మరి.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







