కువైట్ నుంచి ఫోన్ లో భార్యకు ట్రిపుల్ తలాక్...పాకిస్థాన్ లేడీ ట్రాప్‌లో పడి....!
- August 16, 2024
కువైట్ సిటీ: కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తానీ మహిళను సౌదీ అరేబియాలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని చురు జిల్లాకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్ళాడు. అక్కడ రవాణా రంగంలో పనిచేస్తున్నాడు. 2011లో హనుమాన్ గడ్ జిల్లాకు చెందిన ఫరీదా భానుతో రెహమాన్ పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు
కాగా.... కువైట్ లో ఉంటున్న రెహమాన్ కు పాకిస్తానీ మహిళ మెహ్విష్ తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆమెను వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. గత నెలలో కువైట్ నుంచి తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత మెహ్విష్ ను వివాహం చేసుకున్నాడు. గత నెలలో ఆమె టూరిస్ట్ వీసాపై రాజస్థాన్ కు వెళ్ళింది. రెహమాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మరోవైపు కువైట్ నుంచి ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పి పాకిస్తాన్ మహిళను పెళ్లాడిన రెహమాన్ పై రాజస్థాన్ లోని తన భార్య ఫరీదా భాను గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం తనను వేధించడంతో పుట్టింట్లో ఉంటున్నట్లు చెప్పింది. దీంతో రెహ్మాన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన రెహమాన్ ను హనుమాన్ గడ్ కు చెందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రెహమాన్ మొదటి భార్య ఫిర్యాదుపై అతడిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు.
--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







