ఇస్రో: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్
- August 16, 2024
శ్రీహరికోట: వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది.
ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







