కోట్లు కాపాడుకున్న సౌదీ రాజు అబ్దుల్ అజీజ్
- June 17, 2016
దివంగత సౌదీ రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజీజ్ తన తండ్రి రహస్య భార్యకు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి నుంచి బయటపడ్డారు. కొన్ని వందల కోట్ల రూపాయలను రాకుమారుడు తండ్రి మరణానంతరం ఆయన భార్యకు చెల్లించాలంటూ గత ఏడాది నవంబర్ లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫహద్ మరణానంతరం జనన్ హర్బ్ అనే ఆమె సౌదీ రాజు తనను రహస్యంగా వివాహమాడారని కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి ఆమెకు రూ. 154 కోట్లతో పాటు లండన్ లో రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు.
దీనిపై రాకుమారుడు అబ్దుల్ అజీజ్ పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జడ్జి ఆమె పట్ల పక్షపాతం వ్యవహరించారని వేరే జడ్జితో కేసు విచారణ జరిపించాలని కోరారు.
విచారణ చేపట్టిన మరో జడ్జి ఆమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. కాగా, బ్రిటీష్ జాతీయురాలైన హర్బ్ 1968లో ఫహద్ ను వివాహమాడినట్లు తెలిపారు. 1982లో రాజైన ఫహద్ 2005లో చనిపోయే ముందు తనను జీవితకాలం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. 2003లో అజీజ్ తనకు రూ. 80 కోట్ల పరిహారంతో పాటు థేమ్స్ నది ఒడ్డున రెండు ఫ్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







