ఫార్మా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

- August 22, 2024 , by Maagulf
ఫార్మా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

అమరావతి: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హరిందర్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం ఇస్తామని, ఎంత మొత్తం అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) మరణించారు. తాపీ మేస్త్రీగా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ‘ఎసెన్షియా’లో చేరారు. రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని సోదరులు కోరినా యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం వెళ్లారు. మృత్యువు వెంటాడటంతో ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com