IGCSE/GCSE ఫలితాలు..100% ఉత్తీర్ణత సాధించిన పలు స్కూల్స్..!
- August 22, 2024
యూఏఈ: IGCSE/GCSE (ఇంటర్నేషనల్/జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా బ్రిటిష్ పాఠ్యాంశాల పాఠశాలలు విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపాయి. ఈ సంవత్సరం యూఏఈ, ఖతార్‌లోని 23 పాఠశాలల నుండి GEMS నెట్‌వర్క్‌లో 3,617 మంది(14 శాతం) గ్రేడ్ 9 లేదా A*ని స్కోర్ చేశాయి. 22 శాతం 9-8 (A*); 9-7 (A*-A) గ్రేడ్లను పొందిన 40 శాతం ఎంట్రీలు; 60 శాతం మంది 9-6 (A*-B), మరియు 83 శాతం మంది 9-4 (A*-C) గ్రేడ్లు సాధించారు. జుమేరా కాలేజ్ దుబాయ్‌లో 27 శాతం GCSE ఎంట్రీలు టాప్ గ్రేడ్ 9, 85 శాతం మంది విద్యార్థులు 9-6 (A*-B) గ్రేడ్లు సాధించారు. GEMS వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 26 శాతం ఎంట్రీలు గ్రేడ్ 9 లేదా A* మరియు 81 శాతం 9-6 (A*-B), GEMS కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్-షార్జా 9-8 (A*) తరగతుల్లో 45 శాతం ఎంట్రీలను సాధించారు. GEMS ఎడ్యుకేషన్ డిప్యూటీ CEO డాక్టర్ సైమా రాణా విద్యార్థులను అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







