ఆ చర్మ సమస్యలు అందుకు సంకేతమా.?

- August 24, 2024 , by Maagulf
ఆ చర్మ సమస్యలు అందుకు సంకేతమా.?

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక మహమ్మారి డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి.

ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయితే ఇక అంతే సంగతి. ఆహార జీవన శైలిలో మార్పులు చేసుకోవల్సిందే. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులొస్తాయ్.

ఆకలి ఎక్కువగా వేయడం, అనవసరమైన నీరసం, కీళ్ల నొ్ప్పులు, ఇలా అనేక మార్పులు రక్తంలో చక్కెర స్థాయులు పెరగడాన్ని సూచిస్తాయ్.

ఇవన్నీ షుగర్ వ్యాధి లక్షణాలే. అధిక ఒత్తిడి కూడా ఈ రోజుల్లో షుగర్ వ్యాధి పెరగడానికి ఓ కారణంగా భావిస్తున్నారు. అయితే, ఆయా లక్షణాలతో పాటూ కొన్ని చర్మ వ్యాధుల లక్షణాలు సైతం షుగర్ వ్యాధిని సూచించే సంకేతాలుగా చెబుతున్నారు.

చర్మంపై అక్కడక్కడా కనిపించే డార్క్ ప్యాచెస్ షుగర్ వ్యాధిని సూచిస్తున్నాయనీ, అలా మచ్చలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

డ్రై స్కిన్ కూడా షుగర్ వ్యాధి లక్షణాల్లో ఒకటిగా తేలింది తాజా సర్వేలో. చర్మంపై దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలు కూడా షుగర్ వ్యాధి లక్షణాల్లో ప్రముఖంగా చెబుతున్నారు. ఇలాంటి చర్మ సంబంధిత లక్షణాలు కనిపిస్తే, రక్తంలో చక్కెర స్థాయుల్ని ఖచ్చితంగా తనిఖీ చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com