ఈ సారి లెక్కలన్నీ సరిపోతాయ్ అంటోన్న నాని.!
- August 24, 2024
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న ‘సరిపోదా శనివారం’ సినిమాపై ఈ వారం బాక్సాఫీస్ అంచనాలు బాగానే వున్నాయ్. ప్రమోషన్లు బాగున్నాయ్.
నాని ఎందుకో తెలీదు ఈ సినిమా కోసం కాస్త ఎక్కువే కష్టపడుతున్నాడు. విరామం లేకుండా ప్రమోషన్లతో దూసుకెళ్తున్నాడు. సౌత్ మీడియా ప్రమోషన్లు దాదాపు పూర్తయ్యాయ్.
ఇక, ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాని ప్రమోట్ చేసేందుకు ముంబయ్ బయలుదేరాడు నాని. ఈ క్రమంలో లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ మరో ప్రోమో రిలీజ్ చేసింది.
మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ, ‘ఈ సారి లెక్కలన్నీ సరిపోతాయ్..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే నానితో పాటూ విలన్ రోల్ పోషించిన ఎస్ జె సూర్య, హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహనన్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
వివేక్ ఆత్రేయ - నాని కాంబినేషన్‌లో ఒక ఫెయిల్యూర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు ఆత్రేయకివ్వాలని నాని తాపత్రయపడుతున్నాడు. చూడాలి మరి, ఆ తాపత్రయం తీరుతుందో. ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం ప్యాన్ ఇండియా వైడ్‌గా ధియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు