రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. సెప్టెంబరు 1 నుండి నిషేధం, జరిమానా రద్దు..
- August 29, 2024
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) సెప్టెంబర్ 1వ తేదీ నుండి రెండు నెలల పాటు రెసిడెన్సీ వీసాలను ఉల్లంఘించిన వారిపై నిషేధం, జరిమానాలను మాఫీ చేసే ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అబుదాబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ICP డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. ప్రవేశ, నివాస నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు మినహాయించే వాటిలో నివాస ఉల్లంఘనదారులు, వీసా ఉల్లంఘించినవారు, పనికి గైర్హాజరు అడ్మినిస్ట్రేటివ్ జాబితాలలో ఉన్నవారు, దేశంలో జన్మించిన విదేశీయుల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారు దేశం విడిచిపెట్టడానికి గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందాలని పిలుపునిచ్చారు. అనుమతి పొందినవారు 14 రోజులలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలా వెళ్లిన వారి పాస్‌పోర్ట్‌లపై నిషేధ ముద్ర వేయడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







