మెక్ డొనాల్డ్ కంపెనీ భారత ఉద్యోగులవైపు..
- June 18, 2016
అమెరికాలో ఇబ్బందులు పడుతున్న ఫుడ్ సప్లయ్ జెయింట్ మెక్ డొనాల్డ్ కంపెనీ భారత ఉద్యోగులవైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్..500 మిలియన్ల డాలర్ల కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇండియానుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఈస్టర్ బూక్ నేతృత్వంలో 500 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించబోతుందని పేర్కొంది. 2015లో అమెరికాలో 400 మంది ఉద్యోగులను తొలగించిన మెక్‌డొనాల్డ్ అభివృద్ధి స్తంభించిందని తెలిపింది. ఇప్పటికే వివిధ రకాలుగా భారత్ మార్కెట్ లోకి ఎంటరైనా సంస్థ అక్కడి ఉద్యోగులకోసం చూస్తోందని పేర్కొంది.
అయితే అకౌంటింగ్ ఫంక్షన్ సహా తమ వ్యాపారాన్ని అనేక కోణాల్లో శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించుకునే క్రమంలోనే ఈ చర్యలని సంస్థ ప్రతినిధి టెర్రీ హికీ చెప్పారు. 2017లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నామన్నారు. అలాగే ఖర్చును తగ్గించుకోనున్నామని సంస్థ వెల్లడించింది. అయితే మెక్ డొనాల్డ్ అమెరికాలో ఉన్న ప్రాంతీయ ఆఫీసులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో 40 గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 25కి చేరడం విశేషం.కాగా కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. తమకు చాలీ చాలని జీతాలు ఇస్తూ.. ఉద్యోగులను సంస్థ వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







