రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ : ఎయిర్ ఏసియా..
- June 18, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'కబాలి' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు... తమిళనాడు రాష్ట్ర ప్రజల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ 'కబాలి'నే హాట్ టాపిక్. అలాగని బెంగళూరు అభిమానులేం తక్కువ కాదు... వారూ అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకని ఈ చిత్ర బృందం బెంగళూరులోని రజినీ అభిమానులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. చిత్రం విడుదల రోజున ఫస్ట్ డే ఫస్ట్‌షోకు బెంగుళూరు నుంచి చెన్నైకి ప్రత్యేకంగా ఎయిర్ ఏసియా విమానాన్ని నడుపుతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.
'కబాలి' చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం ఎయిర్‌లైన్ అవసరం వచ్చిందట.
ఇందులో భాగంగానే ఎయిర్ ఏసియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎయిర్ ఏసియా రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. ఇప్పటికే ప్రయాణికులకోసం కబాలి ప్రత్యేక మెనూ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెంగళూరు - చెన్నై - బెంగళూరు ప్యాకేజిలో రాను పోను టికెట్, సినిమా టికెట్, లంచ్ కూడా కలిసి మొత్తం..రూ.7860. ఇది సినిమా రిలీజ్ అయిన రోజున మాత్రమే సుమా!
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







