డిజిటల్ చెల్లింపులు.. QR31.02bn లావాదేవీలు..!

- September 02, 2024 , by Maagulf
డిజిటల్ చెల్లింపులు.. QR31.02bn లావాదేవీలు..!

దోహా: ఖతార్‌లోని ఫిన్‌టెక్ రంగం చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది.  స్టాటిస్టా నివేదించిన ప్రకారం.. ఖతార్‌లోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 2024 నాటికి QR31.02bn ($8.52bn) మొత్తం లావాదేవీ విలువను సాధించగలదని అంచనా వేస్తున్నారు.  ఇంకా, ఈ మార్కెట్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 8.37%ని ప్రదర్శిస్తుందని,  2028 నాటికి మొత్తం QR42.78bn ($11.75bn) చేరుకుంటుందని భావిస్తున్నారు. డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో 2024 పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక హైలైట్ చేసింది.  డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సెక్టార్‌లో ఒక్కో వినియోగదారునికి నిర్వహణలో ఉన్న సగటు పెట్టుబడులు (AUM) 2024లో QR1,760.55 ($483.60)కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  అయితే ఈ మార్కెట్‌లో ఆదాయ వృద్ధి 2025లో 14.48%గా అంచనా వేశారు.  ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) 2023లో ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా ఫిన్‌టెక్ వ్యూహాన్ని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో 'బై-నౌ-పే-లేటర్' (BNPL) సేవల పెరుగుదలతో, సెంట్రల్ బ్యాంక్ 2023లో BNPL మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది.  ఇందులో లైసెన్సింగ్ విధానాలు,  వినియోగదారు రక్షణ చర్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో QCB BNPL అందించడానికి ఐదు కంపెనీలకు ఆమోదం తెలిపింది.  ఖతార్ ఫిన్‌టెక్ హబ్ 57 ఫిన్‌టెక్ కంపెనీలకు అనుమతి ప్రక్రియను పూర్తి చేయగా.. అవి $500 మిలియన్ల విలువను కలిగి ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్, ఇండియా, బంగ్లాదేశ్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఇతర దేశాల నుండి 26 ఫిన్‌టెక్ సంస్థలు తమ ఆపరేషన్లను ఖతార్ లో సమర్థవంతంగా నిర్వహియిస్తున్నాయని తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com