ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏండ్ల జైలుశిక్ష

- June 18, 2016 , by Maagulf
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40  ఏండ్ల జైలుశిక్ష

ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం 40 ఏండ్ల జైలుశిక్ష విధించింది. కతర్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై మోర్సీకి న్యాయస్థానం శనివారం ఈ శిక్ష విధించింది. ఇదే కేసులో ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఆరుగురు సభ్యులకు ఉరిశిక్ష, మరో ఇద్దరికి 25 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోర్సీకి అదనంగా 15 ఏండ్ల జైలుశిక్ష విధించింది. మోర్సీ సహా ఆరుగురు అతడి బ్రదర్‌హుడ్ అనుచరులకు విధించిన తీర్పును న్యాయస్థానం గతనెలలో గ్రాండ్ ముఫ్తీకి సిఫారసుచేసింది. ఈజిప్ట్ చట్టాల ప్రకారం న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను గ్రాండ్ ముఫ్తీ ఆమోదించాలి. గ్రాండ్ ముఫ్తీ నిర్ణయంతో సంబంధం లేకుండా దోషులకు న్యాయస్థానం శిక్షలు ఖరారుచేసింది.

వీరిలో డాక్యుమెంటరీ సినిమా నిర్మాత అహ్మద్ అబ్దో అలీఅఫీఫీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాస్ద్ న్యూస్‌నెట్‌వర్క్ విలేకరి అస్మాయెల్ ఖాతీబ్, ఆల్ జజీరాలో న్యూస్ ప్రోడ్యూసర్ అయిన జోర్డాన్ పౌరుడు అలాఒమర్ మహ్మద్, ఆల్ అజీరా న్యూస్ ఎడిటర్ ఇబ్రహిం మహ్మద్ హిలాల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com