స్వీడన్ దేశంలో టీవీలు, ఫోన్లు చూడడం బ్యాన్?
- September 02, 2024
స్వీడన్: చిన్న పిల్లలు టీవీలు, ఫోన్ల ముందు గంటలకు పైన సమయం గడుపుతుండడంతో వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్వీడన్ దేశం సూచనలు జారీ చేసింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు టీవీలు, ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలంటూ తల్లిదండ్రులకు ఆ దేశ ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది.
రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు రోజులో ఒక గంట మాత్రమే టీవీలు చూడడానికి అనుమతినివ్వాలని తాజాగా సూచనలు జారీ చేసింది. 6 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు కేవలం రెండు గంటలు మాత్రమే టీవీలు, ఫోన్లు చూడడానికి అనుమతినిచ్చింది. చాలాకాలం నుంచి స్మార్ట్ ఫోన్లు, టీవీలు పిల్లల జీవితాల్లోని ప్రతి అంశంలోకి ప్రవేశించడానికి అనుమతించాయని... ఇకనుంచి తల్లిదండ్రులు అలా చేయొద్దని ఆ దేశ ప్రజారోగ్య మంత్రి జాకోబ్ ఫోర్స్ మెడ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
స్వీడన్ లోని 13 నుంచి 16 సంవత్సరాల బాలబాలికలు స్కూల్ టైం తర్వాత సగటున ఒక రోజుకు ఆరున్నర గంటలపాటు ఫోన్లు, టీవీల ముందే సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. ఇకనుంచి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వీలైనంతవరకు ఫోన్లు, టీవీలకు వారిని దూరంగా ఉంచి కేవలం చదువుపై మాత్రమే దృష్టి పెట్టేలా తగిన చర్యలు తల్లిదండ్రులు తీసుకోవాలని స్వీడన్ ప్రభుత్వము సూచనలు జారీ చేసింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..