క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేనెల ఒమన్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- September 04, 2024
మస్కట్: భారత్, పాకిస్థాన్‌ల మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగే. U-19 ఆసియా కప్‌లో మ్యాచ్ అయినా లేదా ప్రపంచ కప్‌లో మ్యాచ్ అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ క్రికెట్ దాయాదుల మధ్య జరిగే థ్రిల్లర్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఒమన్ సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా అల్ అమెరత్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో అక్టోబర్ 16-27వ తేదీల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, 2024 ACC పురుషుల ప్రీమియర్ కప్ నుండి మూడు క్వాలిఫైయర్ జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒమన్‌లో జరిగిన ప్రీమియర్ కప్‌కు ఆతిథ్య ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జాతీయ జట్లు అర్హత సాధించాయి. యూఏఈ జట్టు ఫైనల్లో ఒమన్‌ను ఓడించి 2025 ఆసియా కప్ , ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో బెర్త్‌ను పొందగా, రన్నరప్ ఒమన్, మూడవ స్థానంలో ఉన్న హాంకాంగ్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..