విషాదం..పెళ్లయిన వారం రోజులకే యువతి మృతి..!

- September 04, 2024 , by Maagulf
విషాదం..పెళ్లయిన వారం రోజులకే యువతి మృతి..!

యూఏఈ: పెళ్లయిన వారం రోజులకే 24 ఏళ్ల నవ వధువు రీమ్ ఇబ్రహీం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు ప్రమాదంలో మరణించింది. షార్జాలోని ఎమిరేట్స్ రోడ్‌లో మూడు వారాల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఎమిరాటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఆమె ఆగస్టు 31 ఉదయం మరణించారు. ప్రమాదానికి మూడు వారాల ముందు రీమ్‌కు వివాహం జరిగింది. వివాహమైన ఉమ్ అల్ క్వైన్ ఫలాజ్ అల్ ముఅల్లా ప్రాంతంలోని అదే హాల్‌లో ఆమె సంతాప సభ జరగడం అందరినీ కలచివేసింది. రీమ్ వెళుతున్న కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అతివేగంతో ఆగిఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిమ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మెదడు పూర్తిగా దెబ్బతిని కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో రోడ్లపై ఇటువంటి విషాదాలను నివారించడానికి మరింత అవగాహన, కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది పిలుపునిచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com