హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
- September 05, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యం లో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 36 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో మళ్లీ రాకపోకలు మొదలవ్వడంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్లపై రాయితీని ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







