ట్రేడింగ్ స్కాంలో రూ. 2200 కోట్లు స్వాహా
- September 05, 2024టెక్నాలజీ పెరుగుతున్నట్టే కుంభకోణాలు కూడా ఆర్థిక మోసాలు కూడా రంగులు మారుస్తున్నాయి. . మనం మోసం పోయామని డబ్బులన్నీ పోయాక కొంత సమయానికి గానీ తెలియరాదు అన్న రేంజ్ లో మోసపోతున్నాం. కొన్నిసార్లు ఏదో ఆశించి చేతులారా డబ్బులు మోసగాళ్లకు సమర్పించుకుంటాం. అదే ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీలో మనమే పొలోమని వెళ్లి మోసపోతాం. అలాంటి ఘటనే అసోంలో జరిగింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. అసోంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడ్ని వేల కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్రూఘర్‌కు చెందిన పుకాన్ తన లగ్జరీ లైఫ్‌స్టైల్, హై ఫ్రొఫైల్‌తో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే. . కేవలం 60 రోజుల్లో 30 శాతం రాబడిని పొందొచ్చని ఇన్వెస్టర్లను ఆకర్షించి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. తన క్రిమినల్ బ్రెయిన్‌తో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, నిర్మాణ రంగాల్లో డొల్ల కంపెనీలు స్థాపించాడు. అసోం సినీ పరిశ్రమలోనూ పెట్టుబడులు పెట్టి.. అక్రమంగా కోట్లు సంపాదించాడు. గువహటిలో ఓ స్టాక్ మార్కెట్ మోసానికి సంబంధించిన కేసు బయటకు రావడంతో పుకాన్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. గువహటి డిబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ మిస్సింగ్ వ్యవహారంలో పుకాన్‌పై ఆరోపణలు రావడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పుకాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్లలో మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెప్టెంబర్ 2 రాత్రి పుకాన్ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్‌తో పాటు అతని మేనేజర్ బిప్లాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై నాన్- బెయిలబుల్ కేసు కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. పుకాన్ కేసుతో పాటు అన్ని ట్రేడింగ్ మోసాల పై సమగ్ర విచారణకు అసోం శర్మ ఆదేశించారు. ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఇతర ట్రెడింగ్‌లు, మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ‘ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వ్యవస్థలు లేవని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. అక్రమార్కులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో మొత్తం రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నారు. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?