మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్

- September 07, 2024 , by Maagulf
మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్

న్యూ ఢిల్లీ: ప్యాసింజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది.టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని మరింత ఈజీ చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టేషన్ అసోసియేషన్ సాయంతో న్యూ డిస్ట్రిబ్యూషన్‌ కెపాసిటీ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్‌డీసీ టెక్నాలజీతో టికెట్ బుకింగ్‌ సేవలను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది. ఆఫర్లు, డీల్స్, యాడ్‌- ఆన్‌లు, అనుకూలమైన ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇకపై బుకింగ్‌ సమయంలోనే కనిపిస్తాయి.దీంతో ఆఫర్ల కోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. బుకింగ్‌ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. లేదా ఎన్‌డీసీ కస్టమర్‌ సపోర్ట్‌ సాయంతో వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com