హైవేపై క్రూయిజ్ కంట్రోల్ ఫెయిల్.. డ్రైవర్‌ను రక్షించిన పోలీసులు
- September 08, 2024
యూఏఈ: తమ కారు క్రూయిజ్ కంట్రోల్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన ఓ వాహనదారుడిని దుబాయ్ పోలీసులు రక్షించారు.వాహన డ్రైవర్ కారును నియంత్రణ కోల్పోవడంతో అత్యవసర సహాయం కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడు. ట్రాఫిక్ పెట్రోలింగ్ విభాగం నిమిషాల వ్యవధిలో స్పందించి, షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డుకు చేరుకుని డ్రైవర్ ను రక్షించారని అసిస్టెంట్ కమాండెంట్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. వాహనదారులు తమ కారు క్రూయిజ్ కంట్రోల్ పనిచేయకపోతే భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. వాహనదారులు తమ సీట్‌బెల్ట్‌ను బిగించుకోవాలని, హజార్డ్ లైట్లు మరియు హెడ్లైట్లను ఆన్ చేయాలని, వెంటనే ఎమర్జెన్సీ నంబర్ (999)ని సంప్రదించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!