తెల్లని గడ్డంతో చిరు..

- June 19, 2016 , by Maagulf
తెల్లని గడ్డంతో చిరు..

మెగాస్టార్ చిరంజీవి రూపురేఖలను మార్చేవారు. ప్రస్తుతం తన 150వ చిత్రంగా 'కత్తిలాంటోడు' చిత్రంలో నటించేందుకు సన్నద్ధమవుతున్న ఆయన బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తెల్లని గడ్డంతో వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన తెల్ల గడ్డంతో ఉన్న చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం కాపు నేతల సమావేశం సందర్భంగా దాసరి నారాయణరావు, పళ్ళంరాజు తదితరులతో చర్చించేందుకు వచ్చిన వేళ సైతం తన పాత రూపంలోనే కనిపించిన ఆయన, తాజాగా ఇలా కనిపించడంతో, 'కత్తిలాంటోడు' చిత్రంలో ఆయన పాత్ర తెల్లని గడ్డంతో ఉంటుందేమోనన్న ఊహాగానాలు బయలుదేరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com