ఒక్క అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- September 09, 2024
యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లే పని వుండదంటారు. యాపిల్‌కే కాదండోయ్. అరటి పండుకి ఆ నియమం వర్తిస్తుంది. ఎందుకంటే అరటి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు మరి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.?
అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే ఒక్క అరటి పండు తినగానే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అలాగే చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది.
అంతే కాదు, వర్కవుట్లు చేసిన తర్వాత కూడా ఒక అరటి పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అధికంగా వుంటుంది. అందుకే అరటిపండు రోజూ తింటే ఎముకలు గట్టిపడతాయ్.
అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారింపు చేస్తాయ్. బరువు నియంత్రణలో వుండేందుకు కూడా అరటి పండు తోడ్పడుతుంది. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లకి అరటి పండు మంచి ఔషధం.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు అరటి పండు రోజూ తీసుకుంటే మంచిది. అరటి పండును రోజూ తీనుకునే వారు హృద్రోగాలకు దూరంగా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు.అరటి పండులోని ఫ్రక్టోస్, సుక్రోస్, గ్లూకోస్ వంటి చక్కెరలు అధికంగా వుంటాయ్. అందుకే డయాబెటిస్ వున్నవాళ్లు అరటిపండును కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది.
అరటి పండులో వుండే ట్రిఫ్టోఫాన్ అమైనోయాసిడ్, సిరటోనిన్‌గా మారుతుంది. అందుకే నిద్రలేమి వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధం. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తిని పడుకుంటే మంచి నిద్రకు ఉపక్రమించొచ్చు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!