‘దేవర’ హంగామా ఎక్కడా.?
- September 09, 2024
‘దేవర’ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ప్యాన్ ఇండియా సినిమా. అంతేకాదు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్ తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ వైభవాన్ని ఈ సినిమాతో నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
అయితే, ఆ హంగామా కానీ, ఆ కళ కానీ ఈ సినిమాకి వుందా.? అంటే అస్సలు లేదంటున్నారు ఎన్టీయార్ అభిమానులే. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ వచ్చిన ఏ ప్రోమో కానీ, గ్లింప్స్ కానీ ఫ్యాన్స్‌ని పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా లేకపోవడమే అందుకు కారణం.
ఇంతవరకూ మూడు పాటలొచ్చాయ్. సో సో గానే నిలిచాయ్. స్టార్టింగ్‌లో రిలీజ్ చేసిన గ్లింప్స్ జస్ట్ ఓకే. ఇక వెరీ లేటెస్ట్ సాంగ్ ‘కొరమీనా.. ’ సాంగ్ అయితే మరీ పేలవంగా వుందన్న అభిప్రాయాలు విన వస్తున్నాయ్.
ఇక కొద్ది రోజుల్లోనే సినిమా రిలీజ్ వుంది. ప్యాన్ ఇండియా స్థాయి సినిమా అంటే ప్రమోషన్లు ఏ రేంజ్‌లో వుండాలి. నెల రోజుల ముందు నుంచే నాని తన సినిమా ‘సరిపోదా శనివారం’ని ఏ రేంజ్‌లో ప్రమోట్ చేసుకున్నాడో తెలిసిందే.
నాని కష్టమే సినిమాకి మంచి ఫలితం ఇచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్టీయార్ ఏం చేస్తున్నాడు.? ‘దేవర’ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటీ.? దెబ్బయిపోడూ.! సెప్టెంబర్ 27న ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..







