15 నుంచి సికింద్రాబాద్ మధ్య నాగపూర్ కు వందే భారత్ రైలు
- September 10, 2024
సికింద్రాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ కు మరో వందే భారత్ రైలు ను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుంచి ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది.
ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దీనిని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ వందే భారత్ రైలు నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలు దేరి.. మధ్యాహ్నం 12.15 గంటలకు కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మళ్ళీ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 కి నాగపూర్ చేరుకుంటుంది. కాగా కాజీపేట, రామగుండం, బళ్లార, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
సికింద్రాబాద్, నాగపూర్ నగరాల మధ్య 578 కిమీల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో చేరుకుంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా.. దీంతో ఐదు రైల్లు కానున్నాయి.
తాజా వార్తలు
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి







