అత్యధిక పురస్కారాలను దక్కించుకున్న 'బాహుబలి'..
- June 19, 2016
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన 63వ 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో 'బాహుబలి' మూవీ సత్తా చాటింది. అత్యధిక పురస్కారాలను దక్కించుకుంది. టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకోగా.. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ బెస్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు సెంథిల్‌ను వరించింది. ఉత్తమ సహ నటి అవార్డును రమ్యకృష్ణ, ఉత్తమ నేపథ్య గాయని అవార్డును గీతా మాధురి (జీవనది పాటకు) పురస్కారాలు అందుకున్నారు.
'శ్రీమంతుడు' మూవీకిగాను సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఉత్తమ నటుడిగా, ఇదే మూవీకి ఉత్తమ సంగీత దర్శకునిగా దేవిశ్రీ ప్రసాద్..
'రుద్రమదేవి' మూవీకి గాను ఉత్తమ నటిగా అనుష్క, అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా బన్నీ ఫిల్మ్ ఫేర్ అవార్డులు స్వీకరించారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇంకా 'భలే భలే మొగాడివోయ్' చిత్రానికి గాను నాని బెస్ట్ జ్యూరీ అవార్డును పొందగా, బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా అఖిల్, 'కంచె' సినిమాకు గాను హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ పురస్కారాన్ని అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తెల్లగడ్డంతో స్టయిలిష్ లుక్‌తో కనిపించి అందర్నీ వావ్ అనిపించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







