‘రాజా సాబ్’.! అస్సలు విశ్రాంతి లేదు మిత్రమా.!

- September 10, 2024 , by Maagulf
‘రాజా సాబ్’.! అస్సలు విశ్రాంతి లేదు మిత్రమా.!

మారుతి దర్శకత్వంలో ప్రబాస్ నటిస్తున్న సినిమా ‘రాజాసాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పండగలూ, సెలవులను సైతం లెక్క చేయకుండా షూటింగ్ ఫాస్ట్‌గా కానిచ్చేస్తున్నారట.

వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ వుందన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా పూర్తి చేసేసి, ప్రబాస్, తదుపరి సినిమా ‘స్పిరిట్’ కోసం డేట్స్ కేటాయించాలనుకుంటున్నాడట.

అందుకే ఈ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కాదు కాదు ఐదుగురు హీరోయిన్లున్నారని ప్రచారం జరుగుతోంది.

మాళవిక మోహనన్ మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, రిథి కుమార్, నిధి అగర్వాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాలో ప్రబాస్‌తో రొమాన్స్ చేయనున్నారనీ తెలుస్తోంది.

అన్నట్లు ఈ సినిమాని మారుతి హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ ‌లుక్‌గా రెట్రో లుక్‌లో ప్రబాస్‌ని రొమాంటిక్‌‌గా చూపించిన సంగతి తెలిసిందే. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక, ముగ్గురు నుంచి ఐదుగురు హీరోయిన్లతో ప్రబాస్ చేయబోయే రొమాంటిక్ రచ్చ ఈ సినిమాలో ఎలా వుండబోతోందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com