‘గేమ్ ఛేంజర్’.! జాతర మొదలైందిగా.!

- September 10, 2024 , by Maagulf
‘గేమ్ ఛేంజర్’.! జాతర మొదలైందిగా.!

‘గేమ్ ఛేంజర్’ మూవీని క్రిస్మస్‌కి రిలీజ్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘జరగండి.. జరగండి..’ అంటూ ఇంతవరకూ ఓ పాటను రిలీజ్ చేశారు. కియారా అద్వానీ, రామ్ చరణ్ కాంబినేషన్‌లో కలర్ ఫుల్‌గా ఈ సాంగ్ డిజైన్ చేయబడింది.

ఇప్పుడు మరో సింగిల్ రాబోతోంది. దాన్ని ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. వినాయక చవితి రోజు ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఆ విషయాన్ని కన్‌ఫామ్ చేశారు.

జాతర నేపథ్యంలో ఈ సాంగ్ వుండబోతోందనీ తెలుస్తోంది తాజా పోస్టర్ చూస్తే. తలకు బాబాయ్ ఐడెంటిటీ రెడ్ టవల్ కట్టుకుని మాస్ స్టెప్‌లో వున్న రామ్ చరణ్ స్టిల్ ఇది. ఈ స్టిల్‌ని సోషల్ మీడియాలో మెగా అభిమానులు తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.

కాగా, రాబోయే సాంగ్ ఎలా వుండబోతోందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. శంకర్ మార్క్‌లో వుండే ఈ సాంగ్ ఖచ్చితంగా కలర్ ఫుల్‌గా వుంటుందని ఆశిస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com