విష్ణు ప్రియ వెర్సస్ సోనియా.! ‘ఆమె’కు అలా కలిసొచ్చేసిందా.?

- September 12, 2024 , by Maagulf
విష్ణు ప్రియ వెర్సస్ సోనియా.! ‘ఆమె’కు అలా కలిసొచ్చేసిందా.?

బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతోంది.? వ్యక్తిగత ఆరోపణలు ఎందుకు జరుగుతున్నాయ్.? అఫ్‌కోర్స్ గతంలోనూ ఇలాంటి ఆరోపణలు జరిగాయనుకోండి. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అనే తీరుగా ఆ రకమైన వ్యతిరేక ఆరోపణలు టర్న్ తీసుకున్న నేపథ్యాలు గతంలో చూశాం.

అలాంటిదే బిగ్‌ హౌస్‌లో ఇప్పుడూ జరుగుతోంది. అదేంటంటే, విష్ణు ప్రియ అడల్ట్ జోక్స్ వేస్తోందనీ, సరిగ్గా డ్రస్ చేసుకోవడమే తనకు తెలీయదనీ సోనియా ఆమెపై అనవసరమైన ఆరోపణలు చేసింది.

దాంతో, విష్ణు ప్రియ చాలా హర్ట్ అయ్యింది. ఆమెనే కాదు, బయట షో చూస్తున్న విష్ణు ప్రియ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సోనియాని ఆడి పోసుకుంటున్నారు.

అయితే, ఈ రచ్చ హౌస్‌లో అంతటితో ఆగడం లేదు. విష్ణు ప్రియ ఏం చేసినా షో చూసి ఇబ్బంది పడే కుటుంబ సభ్యులు లేరనీ, తనకలా కాదు తన కుటుంబ సభ్యులు ఇబ్బంది ఫీలవుతారనీ అందుకే తాను పద్ధతిగా వ్యవహరించుకోవాలనీ సోనియా నోటికొచ్చినట్లుగా విష్ణు ప్రియ క్యారెక్టర్ర‌ని బ్యాడ్ చేసే విధంగా ప్రవర్తిస్తోంది.

ఈ తీరుతో సోనియా కంప్లీట్ నెగిటివ్‌గా ప్రొజెక్ట్ అవుతోంది. బిగ్‌బాస్ అంటేనే అదో పెద్ద రచ్చ పెంట. అందులో మళ్లీ ఇలాంటివంటే.. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు.

ఇదంతా కాదబ్బా.! విష్ణు ప్రియ విషయంలో సోనియా ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేలా వుంది. ఈ తాజా పరిణామంతో విష్ణు ప్రియకి బయటి నుంచి పాజిటివ్ సపోర్ట్ ఎక్కువైపోయింది. సోనియాని అది కాస్త చిక్కుల్లోకి నెట్టే విషయమే మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com