చిరంజీవి కమర్షియల్ యాడ్‌పై ఎందుకింత రచ్చ.?

- September 12, 2024 , by Maagulf
చిరంజీవి కమర్షియల్ యాడ్‌పై ఎందుకింత రచ్చ.?

చిరంజీవికి కమర్షియల్ యాడ్స్ చేయడం కొత్తేం కాదు. గతంలోనూ చాలా సార్లు చాలా కమర్షియల్ యాడ్స్‌లో చిరంజీవి నటించారు. అలా వచ్చిన సొమ్మును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి ఇచ్చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. 

కంట్రీ డిలైట్ పాలకు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌కి హరీష్ శంకర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

అయితే, ఈ యాడ్ విషయంలో ఓ రచ్చ జరుగుతోంది. ఓ సామాజిక వర్గం కంట్రీ డిలైట్ పాలపై నిషేధం విధించినట్లు ఓ మీడియా వర్గం ప్రచారం చేస్తోంది.

గతంలోనూ చిరంజీవి చేసిన కమర్షియల్ యాడ్స్ విషయంలో ఇలాంటి వివాదాలే చెలరేగాయ్. అప్పట్లో ఓ కూల్ డ్రింక్‌ యాడ్‌లో చిరంజీవి నటించడం వల్ల.. ఓ సామాజిక వర్గం ఆ కూల్‌డ్రింక్‌ని బ్యాన్ చేసిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అలాంటిదే ఇప్పుడు ఈ కంట్రీ డిలైట్ పాల యాడ్ విషయంలో మళ్లీ రేగింది. అయితే, ఇదంతా ఓ వర్గం మీడియా కావాలని చేసే దుష్ప్రచారమే కానీ, నిజంగా బ్యాన్ చేయడాల్లాంటివేమీ వుండవని కొందరు ఇస్తున్న వివరణ.

ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కమర్షియల్ యాడ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బోలెడన్ని వ్యూస్ వస్తున్నాయ్. అలాగే, పాలకు సంబంధించిన యాడ్ కావడంతో.. అందరూ పాజిటివ్‌‌గా రెస్పాండ్ అవుతున్నారు.

చిరంజీవి ఆ యాడ్‌లో నటించారంటే ఖచ్చితంగా వాటిపై పాజిటివ్ ఒపీనియన్ వుంటుంది. ఈ పాలు ఏ షాప్‌లో దొరుకుతాయ్.. అని చిరంజీవి ఆత్మారామ్ అడగ్గా.. షాప్‌లో కాదు, యాప్‌లో అంటూ చిరంజీవి చెప్పే సమాధానం బాగుంటుంది. అన్నట్లు ఆ యాప్‌ని ఇప్పటికే చాలా మంది డౌన్ లోడ్ చేసేసుకున్నారు కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com