‘లవ్ సితార’ ట్రైలర్ రిలీజ్..
- September 13, 2024
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగచైతన్యని నిశ్చితార్థం చేసుకొని బాగా వైరల్ అయింది. త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ సినిమాతో రాబోతుంది. శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ జంటగా రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లవ్ సితార’. ఈ సినిమాలో సోనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జీనియా రోడ్రిగ్జ్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
లవ్ సితార సినిమా డైరెక్ట్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి లవ్ సితార జీ5 లో స్ట్రీమ్ అవ్వబోతుంది. తాజాగా ఈ లవ్ సితార హిందీ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శోభిత ధూళిపాళ నెక్స్ట్ సినిమా లవ్ సితార ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. తార (శోభితా ధూళిపాళ) మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటారు. పెళ్లికి ముందు తార ఇంటికి అర్జున్ ఫ్యామిలీ వెళతారు. అక్కడ పెళ్లి జరగటానికి ముందు కుటుంబాల్లో విబేదాలు రావడం, తార – అర్జున్ మధ్య కూడా విబేధాలు రావడంతో వీరి ప్రేమ ఏమైంది? పెళ్లి జరిగిందా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక సినిమాని చాలా భాగం కేరళలో షూట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ లవ్ సితార సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించగా ఈ ఈవెంట్లో శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పోషించిన పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఇంటీరియర్ డిజైనర్ పాత్ర పోషించాను. నిజాయతీగా ఉండే ఓ అమ్మాయి జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంది అనే కథతో ఈ సినిమా రాబోతుంది అని తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం







