దంతాలని మెరిపించే ఆహారం!
- June 19, 2016
మనకు బరువు తగ్గించే ఆహారం గురించి తెలుసు. కానీ నవ్వించే ఆహారం గురించి విన్నారా? పళ్లని మిలమిలా మెరిపించే ఆహారం చక్కగా నవ్వించేదే కదా మరి..! అలాంటివే ఇవి..
స్ట్రాబెర్రీలు: దోరగా లేదా పండిన స్ట్రాబెర్రీల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలని మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పళ్లపై మరకలకి కారణమైన బ్యాక్టీరియాని అదుపు చేస్తాయి. చిగురు వాపు రాకుండా నివారిస్తాయి.
అనాస: దంతాలను సహజంగా శుభ్రపరిచి, దంతాలని మెరిపించే గుణం ఉన్న పండు అనాస. ఇందులోని బ్రొమిలైన్ సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
క్యారెట్:
క్యారెట్‌ని హల్వాగానో, జ్యూస్‌లా చేసుకోవడం కంటే చక్కగా శుభ్రం చేసి పచ్చిగా తినడం మంచిది. పళ్లపై ఇతర పదార్థాల కారణంగా పేరుకున్న బ్యాక్టీరియా, వ్యర్థాలని ఇది తొలగిస్తుంది. పళ్లకి తగిన వ్యాయామం అంది చిగుళ్లూ బలపడతాయి.
కాలీఫ్లవర్: చక్కని పోషకాలు నిండిన కాలీఫ్లవర్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటూ దంతాలనీ చక్కగా మెరిపిస్తుంది. ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో లాలాజలం వూరుతుంది. దంతాల ఎనామిల్‌పై మరకలు పడకుండా చూస్తుంది.
పెరుగు: పెరుగూ, జున్నూ కూడా దంతాలని మెరిపిస్తాయి. క్యాల్షియం, మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు కాబట్టి దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంటాయి. వీటిల్లోని లాక్టిక్ యాసిడ్ దంతాలకి తగిన రక్షణ ఇస్తుంది. పెరుగులోని పాస్ఫరస్ పళ్లపై ఆమ్లాలు పేరుకోకుండా చూసి రంగు మారకుండా కాపాడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







