విక్టోరియా మహారాణి సినిమా..
- June 19, 2016
భారతీయ మూలాలున్న రచయిత్రి రాసిన ఓ పుస్తకం ఆధారంగా విక్టోరియా మహారాణిపై సినిమా చిత్రీకరణ జరగనుంది. 1800లో మహారాణి వద్ద విశ్వాసపాత్రుడిగా పని చేసిన అబ్దుల్ కరీం అనే భారతీయుడి గురించిన విశేషాలే కథాంశం. ఆస్కార్ అవార్డు విజేత అయిన బ్రిటిష్ నటీమణి జుడిడెంచ్.. మహారాణిగా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. 'విక్టోరియా అండ్ అబ్దుల్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది క్వీన్స్ క్లోసెట్ కాన్ఫిడెంట్' శీర్షికన షర్బని బసు రాసిన పుస్తకం ఆరేళ్లక్రితం మార్కెట్లోకి వచ్చింది.'నా పుస్తకంపై సరైనవారే సినిమా తీస్తున్నారని చాలా ఆనందంగా ఉంది. విక్టోరియాగా జుడిడెంచ్ పాత్రకు ప్రాణం పోస్తారు. స్టీఫెన్ ఫ్రీర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లీహాల్ స్క్రీన్‌ప్లే రాస్తున్నారు' అని బసు చెప్పారు. లండన్‌లో పాత్రికేయురాలిగా పని చేస్తున్న బసు మంచి రచయిత్రిగా పేర్గాంచారు. 'స్పై ప్రిన్సెస్'.. తాజాగా 'ఫర్ కింగ్ అండ్ అనదర్ కంట్రీ' పుస్తకాలు రచించారు. 'రచయిత్రిగా ప్రాచీన పత్ర భాండాగారాన్ని ఏళ్లపాటు పరిశోధించి.. మరుగున పడిన చరిత్రను వెలికి తీయడం ఉద్వేగభరితంగా ఉంటుంది. దానిపై సినిమా తీస్తే లక్షల మందికి చేరువవుతుంది' అని ఆమె చెప్పారు. 24 ఏళ్ల కరీం ఆగ్రాకు చెందిన యువకుడు. 1887లో గోల్డెన్ జూబ్లీ(50 ఏళ్లు నిండిన సందర్భంగా జరుపుకునే ఉత్సవం) నేపథ్యంలో విక్టోరియా మహారాణి కోసం టేబుల్ వద్ద నిరీక్షిస్తుంటాడు. అనంతరం మహారాణికి నమ్మినబంటుగా మారి.. కాలక్రమంలో ఆమెకు ఉర్దూ, భారతీయ వ్యవహారాలపై బోధించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







