బరువు తగ్గాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి.!

- September 17, 2024 , by Maagulf
బరువు తగ్గాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి.!

బరువు తగ్గడానికి చాలా మంది చాలా వర్కవుట్స్ చేస్తుంటారు. డైట్ కంట్రోల్స్ కూడా ఫాలో చేస్తుంటారు. అయితే కొన్ని రకాల నేచురల్ ఫ్రూట్ జ్యూస్‌లు బరువు తగ్గడానికి చాలా దోహదం చేస్తుంటాయ్.

వీటి వల్ల్ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు సరికదా.. శరీరానికి ఆరోగ్యం కూడా. ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అరటి పండులో కాసిన్ని పాలు కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, తక్కువ కేలరీలు శరీరానికి అందడం వల్ల ఈ జ్యూస్‌తో బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ. పుచ్చకాయలో తక్కువ కేలరీలు వుంటాయ్. పుచ్చకాయను ముక్కల్లా తిన్నా లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
రాగులతో చేసిన అంబలి లేదా, రాగి మాల్ట్ బరువు తగ్గడానికి బాగా వుపయోగపడుతుంది. నిమ్మరసం, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు.అంతేకాదు, దీంట్లో కాస్త తేనె కలిపి తీసుకుంటే, శరీరం మెటబాలిజం బాగుంటుంది.
జామ కాయలోనూ తక్కువ కేలరీలుంటాయ్ తద్వారా జామకాయను జ్యూస్‌లా చేసుకుని తాగినా ఫలితం వుంటుంది. ఈ జ్యూస్‌లలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ వుండవు. శరీరానికి నేచురల్ తక్షణ శక్తినివ్వడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రించడంలో తోడ్పడతాయ్. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com