'స్పిరిట్’ పై అన్ని అంచనాలు తగునా.?

- September 17, 2024 , by Maagulf
\'స్పిరిట్’ పై అన్ని అంచనాలు తగునా.?

ప్రబాస్ సినిమా అంటే చాలు.. అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. ప్రబాస్‌తో ఆఖరికి మారుతి లాంటి దర్శకుడు తెరకెక్కించే సినిమా అయినా అది భారీ బడ్జెట్ సినిమానే అవుతుంది.
అలాంటిది క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోయే సినిమా అంటే అంచనాలుంటాయ్ కదా మరి. సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా ‘స్పిరిట్’.
ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక, పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది. రేపో మాపో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఈ సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
కాగా ఈ సినిమాకి అప్పుడే వసూళ్ల లెక్కలు అంచనా వేసేస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్న చందంగా సినిమాకి ఇంకా స్క్రిప్టు కూడా ఫైనల్ కాలేదు.
సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందంటూ అంచనాల వేసేస్తూ, భారీ బడ్జెట్‌తో సినిమాని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది.
అయితే, ఈ మధ్య వచ్చిన ‘కల్కి’ సినిమా తప్ప, ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా సూపర్ హిట్ ఖాతాలోకి వెళ్లలేదు. ఇక, వసూళ్ల సంగతి ఏమని చెప్పాలి.! అలాంటిది ఏ లెక్కలో ‘స్పిరిట్’ వసూళ్లు అంచనా వేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే, అక్కడున్నది సందీప్ రెడ్డి వంగా కదా. అదే ఆ అంచనాలకు అసలు కారణం కావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com