బాలీవుడ్‌‌లో సూర్య విలనిజం నిజమేనా.?

- September 17, 2024 , by Maagulf
బాలీవుడ్‌‌లో సూర్య విలనిజం నిజమేనా.?

భాషను ప్రామాణికంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా విడదీసి మాట్లాడుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్. ఇండియన్ సినిమా అంటూ సినీ పరిశ్రమనంతటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేశాయ్ కొన్ని సినిమాలు.
దాంతో, సౌత్, నార్త్.. అనే తేడా లేకుండా నటీనటులు ఆయా భాషా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నార్త్ నుంచి వచ్చి సౌత్‌లో నటిస్తున్నారు పలువురు నటీ నటులు. అలాగే, సౌత్ వాళ్లకీ నార్త్‌లో మంచి అవకాశాలు దక్కుతున్నాయ్.
తాజాగా తమిళ నటుడు సూర్య హిందీలో ఓ సినిమా చేయబోతున్నారనీ తెలుస్తోంది. హిందీ యాక్షన్ ఫిలింస్‌లో పాపులర్ సూపర్ హిట్స్ అందుకున్నాయ్ ‘ధూమ్’ సిరీస్ చిత్రాలు.
తాజాగా ‘ధూమ్ 4’ రూపొందబోతోంది. ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కించిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ పిలింస్ ఈ సీక్వెల్ కూడా నిర్మించనుంది. అలాగే, గత మూడు చిత్రాల్నీ తెరకెక్కించిన ఆదిత్య చోప్రానే ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట.
హీరో, తదితర వివరాలు తెలియాల్సి వుంది. కానీ, విలన్ రోల్ కోసం మాత్రం సూర్యతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే క్లారిటీతో అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com