బాబోయ్ ‘బిగ్’ హౌస్ అంటున్నారా?

- September 17, 2024 , by Maagulf
బాబోయ్ ‘బిగ్’ హౌస్ అంటున్నారా?

బుల్లితెర బిగ్‌‌ రియాల్టీ షో బిగ్‌బాస్ అంటే బాబోయ్ అంటున్నారట సెలబ్రిటీలు. తొలి సీజన్ ఇంట్రెస్ట్‌గా సాగింది. ఆ తర్వాత రెండో సీజన్ సో సోగా నడిచింది.
మూడో సీజన్ నుంచీ బిగ్‌బాస్‌ పై ఆసక్తి సన్నగిల్లింది.అంతేకాదు, బిగ్‌బాస్‌కి వెళితే పాపులారిటీ మూట కట్టుకోవడం ముచ్చటేమో కానీ, క్యారెక్టర్ అసాసియేసన్‌తో పాటూ దిగజారిపోవడం అనే భారం కూడా నెత్తిన మోపుకురావాలన్న నింద పడిపోయింది.
దాంతో,  ఓ మోస్తరు పాపులారిటీ వున్నవాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. దాంతో, ఆయా సీజన్లలో అరా కొరా పాపులర్ సెలబ్రిటీలతోనే కానిచ్చేస్తున్నారు.
ఇక లేటెస్ట్‌ సీజన్ 8 వ సీజన్‌దీ అదే పరిస్థితి. ఒక్కరూ ప్రాధాన్యత వున్న మొహం లేదు. ఏదో అరా కొరా పాపులారిటీ వున్నవాళ్లతోనే షో నడిపించేస్తున్నారు. ఇదిలా వుంటే, లేటెస్ట్‌ సీజన్‌కి సంబంధించి ఆల్రెడీ రెండు వారాలు గడిచింది.
రెండు ఎలిమినేషన్లు కూడా జరిగిపోయాయ్. 14 మందితొ స్టార్ట్ అయిన షో, రెండు ఎలిమినేషన్ల తర్వాత 12 మందికి చేరింది. బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం నుంచీ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వుండబోతోందనీ అంటున్నారు.
అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సెలబ్రిటీలెవ్వరూ ఆసక్తి చూపించడం లేదనీ తెలుస్తోంది. ముందుగా డీల్ కుదుర్చుకున్నవాళ్లే వెనక్కి తగ్గుతున్నారట. దాంతో, మాజీ కంటెస్లెంట్లలోనే కొందరి పేర్లు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com