సెప్టెంబరు 23న షార్జా సఫారీ ప్రారంభం..!

- September 17, 2024 , by Maagulf
సెప్టెంబరు 23న షార్జా సఫారీ ప్రారంభం..!

యూఏఈ: ఆఫ్రికా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ అయిన షార్జా సఫారీ నాల్గవ సీజన్‌ సెప్టెంబరు 23న ప్రారంభం కానుంది.  300 కొత్త జంతువులు, పక్షులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.  షార్జాలోని ఎన్విరాన్‌మెంట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అథారిటీ (ఇపిఎఎ) ఛైర్‌పర్సన్ హనా సైఫ్ అల్ సువైదీ మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ షార్జా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి దార్శనికతను ఈ సఫారీ ప్రతిబింబిస్తుందని కొనియాడారు.  షార్జా సఫారీ 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. సఫారీలో 120 కంటే ఎక్కువ జాతులకు చెందిన 50వేల జంతువులు ఉన్నాయి. 

సఫారీ సమయాలు
షార్జా సఫారి సందర్శకులకు ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అనేక రకాల టిక్కెట్ ప్యాకేజీలను అందిస్తోంది.   

టిక్కెట్ ధరలు
పెద్దలు Dh40- Dh275, పిల్లల (వయస్సు 3-12) Dh15- Dh120, 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం.  వీటితో ప్రైవేట్ పర్యటనలకు ప్రత్యేకంగా ఛార్జ్ చేస్తారు. ఇందుకోసం ఫ్యాకేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com